ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ నటుడు బండ్ల గణేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక సినిమా నిర్మాతగా ఒక వెలుగు వెలిగిన బండ్ల గణేష్ అత్యాశతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన చెప్పిన 7'O క్లాక్ బ్లేడ్ డైలాగ్ నేటికీ సెన్సేషన్ అవుతూనే ఉంది. అయితే ఫలితాలు  చూశాక  రాజకీయాల్లోకి వచ్చి క్షమించరాని తప్పు చేశానని గమనించిన బండ్ల , ప్రస్తుతం రాజకీయాలను దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని ట్రై చేస్తున్నాడు. అయినప్పటికీ బండ్ల  రాజకీయ ప్రయాణంపై పలు రూమర్స్ షికారు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే వీటిపై చాలాసార్లు రియాక్ట్ అయిన బండ్ల గణేష్ మరోసారి స్పందించాడు.



నాకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ బండ్ల గణేష్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయాణాలపై కామెంట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీంతో ''నాకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన'' అని బండ్ల గణేష్ స్వయంగా పేర్కొన్నా కాని అతనిపై వస్తున్న  రూమర్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు.ఇక విసిగిపోయి చేసేది లేక బండ్ల మరోసారి ట్విట్టర్ వేదికగా దండం పెడుతూ ట్వీట్ చేశాడు.

''నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం'' అని తెలుపుతూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ తో ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. దీంతో బండ్ల టోటల్ గా  రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే  కన్ఫామ్ అయింది. కానీ కొందరు నెటిజన్స్ మాత్రం ఇది కూడా నమ్మడం లేదు. 'గతంలో బ్లేడు విషయంలో మీడియా ముఖంగా వాగ్దానం చేసి కూడా తప్పుకున్న మీరు ఇప్పుడు మాత్రం నిజం చెబుతున్నారని నమ్మకం ఏంటి?' అంటూ లాజిక్ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే బండ్ల మాటలపై జనానికున్న అభిప్రాయం నమ్మకం  ఏంటనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: