2021 లో అనుష్క సరికొత్త ప్లాన్ తో వస్తుందని తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే కాదు అనుష్క ఇక మీదట కమర్షియల్ సినిమాల్లో కూడా నటించేందుకు రెడీ అంటుందట. అందుకే 2021 లో వరుస సినిమాలకు ఓకే చెప్పాలని చూస్తుంది. ఆల్రెడీ అనుష్క రెండు స్టార్ సినిమాల డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. చూస్తుంటే మరోసారి అనుష్క తన సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ సైరా నరసిం హా రెడ్డి సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నటించిన అనుష్క రాబోయే సినిమాలతో స్టామినా ప్రూవ్ చేసుకోనుంది.
ఇంతకీ అనుష్క నెక్స్ట్ ఇయర్ చేసే సినిమాలు ఏంటి.. వాటిల్లో ఎలా కనిపించనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అనుష్క మాత్రం ఇక మీదట ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నట్టు టాక్. ఇది నిజంగా అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తప్పకుండా అనుష్క ఫ్యాన్స్ కు 2021 బిగ్ సర్ ప్రైజులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి