మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి ఈ రీమేక్ లో నటిస్తున్నారు. ఏకే రీమేక్ పై రోజుకో వార్త వైరల్ గా మారుతుంది. పవన్ కన్ ఫాం అయిన చాలా రోజులకు రానాని కన్ ఫాం చేశారు. ముందునుండి ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరో వచ్చి వెళ్తున్నా సరే రానా మాత్రం పక్కా అని అన్నారు. కాని పవన్సినిమా ఓకే చేశాక లెక్కలు మారాయి. ప్రాజెక్ట్ అంతా పవన్ చేతుల్లోకి వెళ్లడంతో రానా కూడా ఈ రీమేక్ చేయాలా వద్దా అని అనుకున్నాడట.

పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా సరే రానా కన్నా పవన్ కే ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. అలా కాదని రానాకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకే ఈ టెన్షన్ అంతా దేనికని రానా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు చెబుతున్నారు. సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సూపర్ హిట్ రీమేక్ కు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ బిల్లా రంగా అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ రానా ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోవడం నిజమే అయితే మాత్రం ఈ సినిమాకు మరో హీరోని వెతకాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి రానా ఈ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయిన విషయాన్ని మాత్రం అఫీషియల్ గా చెప్పలేదు. ఈకాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. రానా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ఏకే షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుందిల్. ఇక పవన్ మాత్రం చాలా సినిమాలు కమిట్ అవగా ఒక సినిమాకు ఒక షెడ్యూల్ మరో సినిమాకు మరో షెడ్యూల్ ఇలా ప్లాన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: