ప్రభాస్ ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప.. పాన్ ఇండియన్ స్టార్‌గా మారాక అది కూడా లేదు. రెండేళ్లకో సినిమా చేస్తున్నాడనే కామెంట్స్ ఉన్నాయి. అయితే 'సాహో, రాధేశ్యామ్'కి తీసుకున్నట్లు ఇకనుంచి ఒక్కో సినిమాకి రెండుమూడేళ్లు తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. వచ్చే ఏడాది నుంచి స్పీడ్ అనే మాటకి అర్థం చూపించాలని డిసైడ్ అయ్యాడట డార్లింగ్.
ప్రభాస్ వచ్చే ఏడాది 'రాధేశ్యామ్' సినిమాని విడుదల చేయబోతున్నాడు. అలాగే 'ఆదిపురుష్, సలార్' సినిమాలని కూడా సెట్స్‌కి తీసుకెళ్తున్నాడు. సైమల్టేనియస్‌గా ఈ రెండు ప్రాజెక్టులని పూర్తి చేయాలని, వీలైతే వచ్చే దసరాకి 'సలార్' రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. ఇక ఈ మూడు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌కి కూడా 2021లోనే ముహూర్తం పెట్టాడని తెలుస్తోంది.
నాగ్‌అశ్విన్‌కి రీసెంట్‌గా ప్రభాస్ ఫ్యాన్ ఒక పోస్ట్ పెట్టాడు. న్యూ ఇయర్‌కి గానీ, పొంగల్‌కి గానీ ఏమైనా అప్‌డేట్ ఉందా అని అడిగాడు. దీనికి పొంగల్ తర్వాత మన అప్‌డేట్ ఇస్తా.. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోంది అని రిప్లై ఇచ్చాడు నాగీ. దీంతో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వొచ్చనే ప్రచారం మొదలైంది. మరి ప్రభాస్ వచ్చే ఏడాది ఒక సినిమా రిలీజ్ చేసి, మరో మూడు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తే అదొక రికార్డ్ అనే చెప్పొచ్చు.
మొత్తానికి ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి ప్రభాస్ ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి