సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో చాలా మంది హీరోయిన్లు పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా హీరోయిన్ నుంచి హౌజ్ వైఫ్ గా ప్రమోట్ అయిన వాళ్ళలో లైలా ఒకరు. అప్పట్లో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఎగిరేపావురమా చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన లైలా ఉగాది, పెళ్లిచేసుకుందాం, పవిత్రప్రేమ, ఒకేఒక్కడు, శివపుత్రుడు, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

దుశ్మన్ దునియా కా అనే సినిమాతో బాలీవవుడ్ లో అడుగుపెట్టిన లైలా, హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ భాష చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. బాల దర్శకత్వంలో సూర్యగా హీరోగా వచ్చిన నంద సినిమాలో లైలా హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో ఈమె నటనకు బెస్ట్ తమిళ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. అలానే తెలుగులో శివపుత్రుడుగా రిలీజైన పితామగన్ సినిమాకి కూడా లైలాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ తమిళ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ITFA అవార్డులు వచ్చాయి. తెలుగులో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

 చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో లైలా, ఒక బిజినెస్ మేన్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూనే, మరోపక్క భర్తకు వ్యాపారాల్లో సాయం చేస్తున్నారు. 2006 లో వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయిన లైలా, చాలా కాలం తర్వాత బుల్లితెర మీద సందడి చేశారు. 2019 లో జీతమిళ్ లో వచ్చిన "డాన్స్ జోడి డాన్స్ జూనియర్స్" అనే షోకి జడ్జ్ గా వ్యవహరించారు. అంతేకాకుండా ఓ తమిళ సీరియల్ లో కూడా గెస్ట్ రోల్ చేశారు. ప్రస్తుతం "యాలిస్" అనే అప్ కమింగ్ క్రైమ్ థ్రిల్లర్ లో కీలకపాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2021 లో రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: