కె.జి.ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ డైరక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే వచ్చిన పార్ట్ 2 టీజర్ గురించి మాటల్లో చెప్ప్లేనంత క్రేజ్ వచ్చేసింది. వరల్డ్ టాప్ వ్యూస్ లిస్ట్ లో కె.జి.ఎఫ్ కూడా స్థానం సంపాదించుకుంది అంటే మాములు విషయం కాదు. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సలార్ సినిమాలో యశ్ కూడా ఉంటాడని కొందరు అంటున్నారు. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో యశ్ కూడా పాల్గొన్నాడు. ఒక వైపు బాహుబలి ప్రభాస్.. మరోవైపు కె.జి.ఎఫ్ యశ్ ఇద్దరు సలార్ ఓపెనింగ్ రోజు కనిపించేసరికి ఈ సినిమాలో ఇద్దరు నటిస్తున్నారన్న టాక్ వచ్చింది. అయితే కె.జి.ఎఫ్ తర్వాత యశ్ కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నాడు. తెలుగులో అతనికి మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

సలార్ మూవీలో యశ్ ఉండటం అనేది జరగదు కాని ఒకవేళ సలార్ లో యశ్ ఉండటం నిజమైతే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ఇద్దరు భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి సినిమా చేస్తే రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. మరి సలార్ లో యశ్ నటిస్తాడా.. చిన్న కెమియో అయినా ప్లాన్ చేస్తారా అన్నది తర్వాత తెలుస్తుంది. చాప్టర్ 2 రిలీజ్ తర్వాత యశ్ క్రేజ్ డబుల్ అవడం ఖాయమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: