యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కె.జి.ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పార్ట్ 2 సెట్స్ మీద ఉంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2కి సంబందించిన టీజర్ ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయ్యింది. సినిమా మీద పార్ట్ 2 టీజర్ భారీ అంచనాలు ఏర్పరచింది. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ మీద దృష్టి పెట్టనున్నాడు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ డాన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ డైరక్టర్ తో బాహుబలి ప్రభాస్ సలార్.. ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. దిశా పటాని, కియరా అద్వానిల పేర్లు పరిశీనలలో ఉన్నాయి. అయితే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమాకు ఆల్రెడీ దీపికా పదుకొనెని సెలెక్ట్ చేశారు.

అందుకే ప్రభాస్ సలార్ కు హీరోయిన్ల సమస్య ఏర్పడ్డదని తెలుస్తుంది. దిశా, కియరాలను అనుకున్నా వారు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అందుకే వారిద్దరు కాకుండా వేరే ఎవరినైనా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారు. మరి ప్రభాస్ గాళ్ ఫ్రెండ్ గా సలార్ లో ఎవరు జోడీ కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: