ఒక సినిమా వందకోట్లు కలెక్ట్ చేయడం చాలా కష్టం. మార్కెట్‌ లెక్కలని మ్యాచ్ చేస్తూ, బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయడం అంత ఈజీ కాదు. అంటారు అందుకే బిలియన్ మార్క్ దాటితే బ్లాక్ బస్టర్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఈ బిలియన్ మార్క్‌ని కూడా చాలా చిన్న అమౌంట్‌గా మార్చేస్తున్నారు కొంతమంది హీరోలు.

'బాహుబలి'కి ముందు ప్రభాస్ సినిమాలు 40 కోట్ల లోపు బడ్జెట్‌తోనే తెరకెక్కేవి. కానీ ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత డార్లింగ్‌ మార్కెట్‌ పెరిగిపోయింది. ఇప్పుడు కేవలం సినిమా బడ్జెట్‌కే రెండు, మూడు వందలకోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఇప్పుడు ప్రభాస్ సైన్ చేసిన సినిమాలన్నీ లార్జ్‌ స్కేల్‌లోనే తెరకెక్కుతున్నాయి.  

ప్రభాస్‌ ప్రస్తుతం 'రాధేశ్యామ్'తో బిజీగా ఉన్నాడు. ప్యూర్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న 'సలార్' బడ్జెట్ కూడా 100 కోట్లు దాటుతుందని టాక్. ఇక మైథలాజికల్‌ మూవీ 'ఆది పురుష్', నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అయితే రెండు నుంచి మూడు వందల కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

టాలీవుడ్‌ మోస్ట్ అవైటడ్ మూవీ 'ట్రిపుల్ ఆర్' ఇండియాలోనే భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మాణమవుతోంది. ఇక ఈ సినిమానే తారక్, చరణ్‌ కెరీర్‌లో లార్జ్‌ స్కేల్‌ మూవీ.


లాస్ట్ ఇయర్ కరోనాతో నష్టాల్లోకి వెళ్లినా, ఈ ఏడాది మాత్రం టాలీవుడ్‌కి బిగ్గెస్ట్ ఇయర్‌గా మారుతోంది. లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌తో ఈ ఏడాది వేలకోట్ల బిజినెస్ చేసుకోబోతోంది. కేవలం టాప్‌ హీరోల సినిమాలతోనే 15 వందల కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుందని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.  

పవన్‌ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నా మార్కెట్‌ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ మార్కెట్‌కి తగ్గట్లుగానే పవన్‌ కళ్యాణ్ సినిమాలు 70 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశముంది. ఇక క్రిష్ డైరెక్షన్‌లో చేస్తోన్న హిస్టారికల్ డ్రామా బడ్జెట్‌ అయితే 100 కోట్లు పైనే ఉంటుందట. ఈ ఏడాది పవన్‌ చేస్తోన్న మూడు సినిమాలతో 300 కోట్లకు పైనే బిజినెస్ జరుగుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: