
ప్రస్తుతం ఆయన దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న రిపబ్లిక్ అనే ఒక పొలిటికల్ డ్రామా లో నటిస్తున్నారు. అలాగే కార్తీ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న దండు సినిమాలో హీరోగా చేస్తున్నారు. అయితే దేవకట్టా లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కార్తీ వర్మ తీసిన సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఐతే ప్లాప్ డైరెక్టర్లతోనే సాయి ధరమ్ తేజ్ సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారో ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. అంతే కాదు ఆయన తన తదుపరి సినిమాలు తీయడానికి కూడా ఫ్లాప్ డైరెక్టర్లనే ఆశ్రయిస్తున్నారట.
నిజానికి మెగా హీరోలు ప్రతిష్టాత్మక బ్యానర్లపై సక్సెస్ఫుల్ డైరెక్టర్ లతో కలిసి సినిమాలు తీస్తున్నారు. కానీ సాయిధరమ్ తేజ్ ప్లాప్ డైరెక్టర్లతో ప్రయోగాత్మక సినిమాలు ఒప్పుకుంటూ రిస్కు చేస్తున్నారు. కానీ సినిమాలు వరుసగా ప్లాప్ అయితే కెరీర్ గాడి తప్పుతుంది. ఇదే విషయాన్ని చిరంజీవి సాయి ధరమ్ తేజ్ కి చెప్పాలని నిర్ణయించుకున్నారట. వాస్తవానికి కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సాయిధరమ్ తేజ్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకునే వారు. కానీ కొంత కాలం తర్వాత సాయిధరంతేజ్ తన సొంతంగా స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల ఆయనకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో మళ్లీ చిరంజీవి తన మేనల్లుడికి సినిమాల ఎంపిక విషయంలో సలహాలు ఇస్తారని తెలుస్తోంది.