ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీ విష్ణు టాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన ప్రస్తుతం గాలి సంపత్, రాజా రాజా చౌరా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే శ్రీ విష్ణు తొలిసారిగా నారా రోహిత్ హీరోగా నటించిన బాణం సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన అల్లు అర్జున్, రానా తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయనకు ఎంతో నటనా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన పాత్ర దొరకకపోవడంతో స్టార్ హీరో హోదాకి ఇంకా చేసుకోలేకపోయారు.

ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే.. 2013వ సంవత్సరంలో శ్రీ విష్ణు.. ప్రశాంతి ముళ్ళపూడి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి ప్రశాంతి శ్రీ విష్ణు కి చిన్నతనం నుంచే మంచి స్నేహితురాలు గా ఉండేవారు. అయితే వారి స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. అనంతరం తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఐతే ప్రశాంతి తల్లిదండ్రులు బాగా ధనవంతులని.. ప్రస్తుతం వారు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారని సమాచారం. ప్రశాంతి, శ్రీ విష్ణు దంపతులకు మ్రిధ అనే పాప కూడా ఉంది. శ్రీ విష్ణు కి సినిమాలు మరియు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే ఆయన అండర్ 19 క్రికెట్ జట్టులో కూడా ఆడారు. అనంతరం సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని హైదరాబాద్ వచ్చారు.

అయితే ప్రశాంతి, శ్రీ విష్ణు జంటకు పెళ్లి చేయడంలో హీరో నారా రోహిత్ బాగా సహాయం చేశారట. నిజానికి అంతకంటే ముందు నారా రోహిత్, శ్రీవిష్ణు ఒక డాన్స్ స్కూల్ లో పరిచయం అయ్యారు. ఇక ఆరోజు నుంచి నారా రోహిత్, శ్రీ విష్ణు మంచి స్నేహితులయ్యారు. ఆయన హీరోగా నటించిన పలు సినిమాలకు నారా రోహిత్ ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించారని టాక్. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి నిర్మాతగా శ్రీ విష్ణు భార్య ప్రశాంతి వ్యవహరించారని అంటారు కానీ ఆ సినిమాకి నారా రోహిత్ కూడా డబ్బు ఇన్వెస్ట్ చేశారని చెబుతుంటారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో తనకు ఉన్న ఏకైక స్నేహితుడు నారా రోహిత్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు తనకోసం కూడా నారా రోహిత్  షాపింగ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: