తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దుబాయిలో తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో గోవాలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీలైనంత వేగవంతంగా సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని పక్కాగా థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తుందని అంటున్నారు. కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఉద్యోగిని గా కనిపించనున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అరవిందస్వామి మెయిన్ విలన్ పాత్రకు ఇటీవల ఎంపికయ్యారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.హీరోతో పాటు ఢీ అంటే ఢీ అనేలా సాగే విలన్ క్యారెక్టర్ కోసం మొదట పలువురు నటులను పరిశీలించిన దర్శకుడు పరశురామ్ ఆ తర్వాత ఫైనల్ గా ఆ పాత్రకు అరవిందస్వామి అయితేనే పక్కాగా యాప్ట్ అవుతారని భావించి ఆయనని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అలానే ఇప్పటికే అరవింద్ స్వామి డేట్స్, కాల్షీట్స్ కూడా తీసుకున్నారని అతి త్వరలో ఆయన సర్కారు వారి పాట సెట్స్ లో జాయిన్ అవనున్నారని అంటున్నారు. ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ సినిమా లో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న అరవింద్ స్వామి తొలిసారిగా మహేష్ తో చేస్తున్న ఈ సర్కారు వారి పాట ద్వారా ఎంత వరకు ఆడియన్స్ ని అలరిస్తారో చూడాలి. మరి ఎప్పుడు ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలి అంటే సర్కారు వారి పాట యూనిట్ నుండి అఫీషియల్ న్యూస్ వెలువడే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి