నేను శైల‌జ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ కీర్తి సురేష్. మొద‌టి సినిమాతోనే కీర్తి తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. చూడ్డానికి ప‌క్కింటి అమ్మాయిలా కనిపించే కీర్తిసురేష్ నేను శైల‌జ త‌ర‌వాత వ‌రుస సినిమాల్లో న‌టించి ఫుల్ బిజీగా మారింది. ఇక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హాన‌టి సినిమాతో కీర్తి దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో న‌టించిన కీర్తి ఆ పాత్ర‌లో జీవించేసింది. దాంతో సినిమాకు  విమ‌ర్ష‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం..కీర్తి సురేష్ న‌టనకు మంచి మార్కులు ప‌డ‌టంతో ఆ త‌రవాత వ‌రుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించింది. అయితే కీర్తి న‌టించిన పెంగ్విన్‌, మిస్ ఇండియా చిత్రాల‌కు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. దాంతో ఇంత‌కాలం హిట్ కోసం వేచి చూసిన కీర్తి సురేష్ ఈ వారం విడుద‌లైన రంగ్ దే సినిమాతో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నితిన్ హీరోగా న‌టించారు.

ఇక ఈ సినిమాకు మొద‌టి నుండి కీర్తి వీడియోల‌తో ప్ర‌మోష‌న్స్ జ‌రిగాయ‌ని చెప్ప‌వ‌చ్చు. షూటింగ్ స‌మ‌యంలో కీర్తి, నితిన్ ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించ‌డం...కీర్తి ర‌క‌ర‌కాల చీర‌లతో క‌నిపించ‌డం..కీర్తి ఎక్కువ ఫుడ్ ను లాగించేయ‌డం. ఇలా ఒక్కోవీడియో వైర‌ల్ అయ్యింది. ఇక తాజాగా కీర్తి సురేష్ మ‌రో వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీకెండ్ కోసం ప‌రిగెడుతున్న‌ట్లు అంటూ ఆ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇక ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం ప‌రుగులు పెడుతూ క‌నిపిస్తుంది. బోట్ ఎక్క‌డ మిస్ అవుతుందో అన్న‌ట్టు..ఆపండి ఆపండి అంటూ కీర్తి సురేష్ ప‌రుగులు తీస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప‌గ‌ల‌బడి న‌వ్వుతున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో మైదాన్ అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రంలో అజ‌య్ దేవ్‌గ‌న్ హీరోగా న‌టిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: