మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. కరోనా సమయాల్లో కూడా వకీల్ సాబ్ చిత్రానికి సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రేక్షకులతో పాటు సినిమా విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో థియేటర్లు జనం తో పోటెత్తుతున్నాయి. అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొదటిరోజు వకీల్ సాబ్ చిత్రం 32 కోట్లు వసూలు చేసింది. అయితే కొన్నేళ్ళ క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" సినిమా ఫస్ట్ డే రూ. 26 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ రికార్డుని వకీల్ సాబ్ చిత్రం చెరిపివేసింది.



గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మహేష్ బాబు సినిమా "సరిలేరు నీకెవ్వరు" మొదటిరోజు 32 కోట్లు వసూలు చేసింది. దీంతో పవన్ సినిమా మహేష్ బాబు సినిమాకి సరిసమానంగా ఫస్ట్ డే కలెక్షన్లు రాబట్టింది. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా మహేష్ సినిమాని మించి కలెక్షన్లు రాబట్టటం విశేషం.




సోషల్ మీడియా తో పాటు బయట జనాల నోళ్ళలో కూడా పవన్ సినిమానే నానుతోంది. లాయర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన చూపించారని పాజిటివ్ టాక్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఈ సినిమా మంచి కంటెంట్ తో రూపొందింది కాబట్టి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్తున్నారు. ఫలితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బుల వర్షం కురుస్తోంది.



ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు సమగ్రంగా తెలుసుకుంటే..



-> నిజాం : 8.75Cr


-> సెడెడ్ : 4.0Cr


-> అమెరికా: 3.85Cr (GST-37L)


-> ఈస్ట్ గోదావరి: 3.1Cr (Hires-90L)


-> వెస్ట్ గోదావరి: 4.5Cr (Hires, MG-3.41Cr)


-> గుంటూరు : 3.94Cr (Hires –1.8Cr)


-> కృష్ణ : 1.9Cr (hires+GST -34L)


-> నెల్లూరు : 1.7Cr (hires-41L)


టోటల్ :- 32.24CR (44Cr~ Gross) (6Cr Hires)

మరింత సమాచారం తెలుసుకోండి: