ఇండియా లో సోనూసూద్ ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాడు.బాలీవుడ్ నటుడు గా పలు సినిమాల్లో చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న సోను సూద్ లాక్ డౌన్ టైంలో చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు.. ప్రజలు లాక్ డౌన్ వల్ల పడే ఇబ్బందిని గమనించి ముందుకొచ్చి వారికి ఎంతో సహాయం చేశాడు సోనూ.. ఓ వైపు కరోనా విజృంభిస్తున్న సోను మాత్రం అవేవీ లెక్క చేయకుండా ముందుకొచ్చి తన కర్తవ్యం నిర్వర్తించాడు. చేసేది విలన్ పాత్రలే అయినా సోనూ సూద్ బయట మాత్రం రియల్ హీరో అని అయన అభిమానులు చెప్పుకున్నారు.

ఎక్కడ ఉన్నా కూడా మారుమూల ప్రజల కు కష్టం వచ్చిందంటే ఆదుకునే వాడు సోనూ.. అందుకే ఈయన నటుడు నుంచి దేవుడు అయిపోయాడు. దేవుడు అంటూ కొలవడమే కాదు గుడి కట్టి పూజించారు కూడా. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించిన సోనూ సూద్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తనకు పెద్ద మైనస్ గా మిగిలిపీయింది.. కనీసం తనకున్న క్రేజ్ తో అయినా సినిమా ఆడుతుందో అనుకున్నారు కానీ కంటెంట్ చాలా వీక్ గా ఉండడంతో సోను సూద్ ఇమేజ్ ఏమీ పనిచేయలేదు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చేస్తున్నాడు సోనూసూద్..  తాజాగా మానవత్వం ప్రతిబింబించే ఓ పనిచేశాడు సోనూసూద్..

కరోనా తో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ ని ఝాన్సీ  నుంచి హైదరాబాద్ కి తీసుకొచ్చే సదుపాయాలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కైలాశ్‌ అగర్వాల్‌ నాలుగు రోజుల క్రితం కోవిడ్‌ బారిన పడ్డారు. ఆక్సిజన్‌ శాచురేషన్‌ 60–70 మధ్యలో ఉండటంతో బంధువులు ఆస్పత్రుల్లో చేర్చేందుకు యత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. గ్రామస్తులు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోనూసూద్‌ శుక్రవారం ఉదయం కైలాశ్‌ ఇంటికి అంబులెన్స్‌ పంపారు. ఇంటి నుంచి ఝాన్సీ విమానాశ్రయానికి తరలించారు. కైలాశ్‌ అక్కడ నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: