
ఈ వీడియోలో బన్ని హోం క్వారంటైన్ గదిలో నుంచి బయటకు రాగానే.. కొడుకు అయాన్ వెంటనే తండ్రిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక కుమార్తె అర్హ కూడా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనేకమంది ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. బన్నీని వార్‌లో గెలిచిన వారియర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎంత స్టార్ అయినా.. పిల్లలకు తండ్రేనని, ఆ ప్రేమ, ఎమోషన్ ఈ వీడియోలో కనిపిస్తోందని మరికొంతమంది ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారు.
కాగా.. బన్నీలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే వైరస్‌ను గుర్తించడంతో వెంటనే కోలుకోగలిగారు. అయితే మళ్లీ పుష్ప షూటింగ్ మొదలు పెడతారా..? లేదా..? అనేది తెలియాలి. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలనే ఊపులోనే ఉన్నాడట. బన్నీ ఏం చేస్తాడో మరి.