పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా
టాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యంత పాపులారిటీ కలిగిన నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల విడుదలై
బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కరోనా సమయంలోనూ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే
పవన్ని ఒక నటుడిగా మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. అతని మనసు బంగారం అని అభిమానులు సగర్వంగా చెప్పుకుంటారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ కి తనంటే ఒక మంచి అభిప్రాయం ఉందని.. ఆయనే తనని
పవన్ కల్యాణ్ కి పరిచయం చేశారని ఎం.ఎస్
చౌదరి అన్నారు. కానీ ఒక విషయంలో తాను చాలా బాధపడ్డాను అని ఆయన అన్నారు.
పవన్ అందర్నీ చాలా అభినందించారు కానీ తనను అభినందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"గబ్బర్ సింగ్
సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో
జూనియర్ ఆర్టిస్టులు అందరూ కలిసి పాటలు పాడాల్సి ఉంది. అయితే అందరూ పాటలు పాడి
పవన్ యొక్క ప్రశంసలు పొంది బాగా ఆనందపడ్డారు. కానీ నాకు పాట పాడే ఛాన్స్ వచ్చినప్పుడు
పవన్ కళ్యాణ్ లంచ్ కి వెళ్లారు. దీంతో నేను పాట పాడుతున్నప్పుడు షూటింగ్ లో ఆయన లేరు. ఫలితంగా
పవన్ కళ్యాణ్ మందు పాట పాడే అవకాశాన్ని కోల్పోయాను. అంతే కాకుండా
పవన్ కళ్యాణ్ యొక్క ప్రశంసలు పొందటం మిస్ అయ్యాను, " అని ఎం. ఎస్
చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.