పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన నటించిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు మంచి సక్సెస్ కాగా ఆపై వచ్చిన నాలుగవ సినిమా తొలిప్రేమ పెద్ద విజయాన్ని అందుకుని నటుడిగా పవన్ కు బాగా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం పూరి తీసిన బద్రి సినిమా కూడా సక్సెస్ కాగా, ఆపై వచ్చిన ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి పవన్ కు యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

అయితే ఆ మూవీ తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ పై జానీ మూవీ చేసారు పవన్ కళ్యాణ్. తొలిసారిగా ఈ మూవీ ద్వారా మెగాఫోన్ పట్టారు పవన్. ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించగా రమణ గోగుల మ్యూజిక్ అందించారు. అప్పట్లో భారీ ఖర్చు, హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మాత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో కథ బాగున్నప్పటికీ కథనం ఆకట్టుకునేలా లేకపోవడం జానీ పరాజయానికి
ముఖ్య కారణాలుగా పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. కథ ప్రకారం తల్లి మరణం తరువాత మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా మారిన జానీ ఆపై గీత అనే అమ్మాయిని ఇష్టపడడం, అయితే ఆ తరువాత ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలియడంతో ఆమె వైద్యం ఖర్చు కోసం పలువురు ఇతర దేశ మార్షల్ ఆర్ట్స్ పర్సన్స్ తో సైతం జానీ పోటీ పడి ఫైట్ చేసి చివరకు డబ్బు గెలిచి ఆమెను బ్రతికించుకుంటాడు.

సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఇందులో పవన్ చేసిన అద్భుతమైన యాక్షన్, ఫైట్ సీన్స్ కి అందరి నుండి మంచి పేరు దక్కింది. అలానే రమణగోగుల అందించిన సాంగ్స్ కూడా శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ఆ విధంగా ఖుషి తరువాత భర్తీ హైప్ తో విడుదలైన జానీ సినిమా పరాజయం పాలవడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెర పై ప్రసారమైతే మంచి వ్యూస్ ని దక్కించుకుంటూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: