ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఏజెంట్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు అఖిల్. సైరా తర్వాత స్టార్ హీరోల సినిమాలు ప్రయత్నించిన సురేందర్ రెడ్డి ఫైనల్ గా అఖిల్ తో సినిమా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో అఖిల్ తన మాస్ యాటిట్యూడ్ తో అక్కినేని ఫ్యాన్స్ ను అలరిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
అక్కినేని హీరోలకు డిసెంబర్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది. నాగ్, నాగ చైతన్య సినిమాలు డిసెంబర్ లో రిలీజై మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఏజెంట్ కు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. బ్యాచ్ లర్ రొమాంటిక్ హిట్ పడితే ఏజెంట్ తో స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు అఖిల్. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తప్పకుండా అఖిల్, సురేందర్ రెడ్డి కలయికలో వస్తున్న ఏజెంట్ రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. అఖిల్ ఏజెంట్ అనుకున్న టైం కు వస్తుందా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి