టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ గా ఉన్న
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. వాస్తవానికి
పెళ్లి తర్వాత ఏ
హీరోయిన్ కూడా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపదు. తన
భర్త తరపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని సెటిల్ చేసుకునే విధంగా ఆలోచిస్తుంది. కానీ
కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లయిన మరునాటి నుంచి
సినిమా షూటింగులో పాల్గొనడం మొదలు పెట్టింది.
సినిమా పట్ల ఎంత అంకితభావం ఉన్న కూడా ఈ విధంగా చేయడం ఒక
కాజల్ కు మాత్రమే చెల్లింది అని ఆమె అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళంలో రెండు సినిమాలు ఇప్పటికే పూర్తి చేసింది. మరో మూడు సినిమాలు కూడా తమిళంలో చేస్తూ బిజీగా ఉంది. అంతే కాదు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో
నాగార్జున హీరోగా తెరకెక్కే సినిమాలో కూడా ఈమె
హీరోయిన్ గా ఎంపికయింది.
ఈ సినిమాలో
కాజల్ అగర్వాల్ పాత్ర సరికొత్తగా ఉండబోతోందని, గతంలో ఆమె చేయనటువంటి పాత్ర చేయబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక
రా ఆఫీసర్ గా ఆమె నటిస్తుందని చెబుతున్నారు.
నాగార్జున ఎక్స్
రా ఆఫీసర్ గా కనిపిస్తాడట.
నాగార్జున కు పూర్తి స్థాయి లో సహకారం అందించే పాత్రలో
కాజల్ అగర్వాల్ పాత్ర ఉంటుందట. అలాగే ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో
కాజల్ వేశ్య గా కూడా కనిపిస్తుందట. వైశ్య తీవ్రవాదులను ఆకట్టుకుంటూ వారి రహస్యాలను డిపార్ట్మెంట్ కు చేరవేసే పాత్ర కాజల్ ది అని తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ తో సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఆమె పాల్గొంటుందట. మొత్తానికి రెండు రకాల డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో
కాజల్ కి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతుంది అన్నమాట.