మన నటీ నటులు చాలా మంది ఇతర భాషల్లో నటించాలని ముఖ్యంగా తమకు భారీగా పేరు వచ్చే భాషల్లోని సినిమాల్లో నటించాలని ఆశ పడుతూ ఉంటారు. మొదట్లోనే ఇలాంటి అవకాశాన్ని వస్తే ఏ మాత్రం వదిలి పెట్టరు. ప్రాంతీయ భాషా చిత్రంలో చాలా మంది హాలీవుడ్ సీన్ లను కాపీ కొడుతూ స్ఫూర్తి పొందాము అని చెబుతూ ఉంటారు. పెద్ద డైరెక్టర్లు కూడా ఇలాంటి సీన్ లు ఎత్తివేసి కాపీ కొట్టడం చేస్తూ ఉంటారు. అలా వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం హాలీవుడ్ సీన్లతో కాపీ కొట్టిన ఓ ఫ్రీ మేక్ సినిమాలో  నటించింది. 

సినిమా దర్శకుడు ఎవరో కాదు ఆమె భర్త ఆర్కే సెల్వమణి. 1995లో రోజా స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో తెలుగు తమిళ భాషల్లో అసురన్ అనే సినిమాలో నటించారు. అప్పట్లో 4 రాష్ట్రల ప్రభుత్వాలను గజగజలాడించిన వీరప్పన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథకు హాలీవుడ్ మూవీ ప్రెడేటర్ కలిపి సినిమాను తెరకెక్కించారు సెల్వమని. ఈ సినిమాలో అరుణ్ పాండ్యన్ హీరో కాగా హీరోయిన్ రోజా నటించింది. 

హాలీవుడ్ సినిమాలో ఆర్నాల్డ్ హీరో కాగా అప్పటికే ఆర్నాల్డ్ కు కండలవీరుడు అన్న పేరు ఉంది ఇక్కడ అరుణ్ పాండ్యన్ సైతం అదే బాడీ తో ఉండే వారు. ఈ క్రమంలోనే అరుణ్ పాండ్యన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని ఫిక్సయ్యాడు సెల్వమని. ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా చేశాడు సెల్వ.  ఈ సినిమా అప్పట్లో సంచలనం సాధించింది. అలా డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమా చేయకపోయినా పరోక్షంగా హాలీవుడ్ కాపీ చేసిన సినిమాల్లో నటించింది రోజా.. ఇప్పుడు ఎమ్మెల్యేగా బుల్లితెరపై కామెడీ షో కి జడ్జ్ గా ,  నటిగా , సామాజిక వేత్త గా చాలా రకాల పాత్రలు పోషిస్తోంది రోజా. మరి భవిష్యత్ లో ఎలాంటి సినిమాలను తెరకేక్కిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: