
సెక్సీ భామ శృతిహాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చారు. ఆమె రీ ఎంట్రీ తోనే మంచి హిట్ అందుకున్నారు. వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ సతీమణిగా శృతిహాసన్ నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలసి రొమాన్స్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో ఆమె ఒక చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. ఈ విధంగా ఆమె రీఎంట్రీ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యమున్న రోల్స్ చేజిక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బాలకృష్ణ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తో కలిసి బాలకృష్ణ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య బాబు సతీమణిగా శృతిహాసన్ నటించనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. సాధారణ గృహిణిగా కనిపించేందుకు శృతిహాసన్ కాస్త లావెక్కనున్నారని సమాచారం. అయితే బాలకృష్ణ సినిమా కోసం ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకోవటం తో అభిమానులు తెగ కలవర పడిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇటీవల లాక్‌డౌన్ లో కాస్త లావెక్కుతారు. తర్వాత ఆమె కఠినమైన వ్యాయామాలు చేసి సన్నబడి మంచి ఫిగర్ తో ప్రత్యక్షమై అభిమానులను ఫిదా చేశారు. అయితే ఆమె మళ్లీ లావెక్కడానికి రెడీ కావడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ నివేదికల ప్రకారం ఆమె జిమ్ వర్కౌట్స్ చేయడం మానేసి ఎక్కువ ఆహారం తీసుకోవడం మొదలు పెట్టారట.
వాస్తవానికి బాలకృష్ణ సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోలేదని కొంతకాలం క్రితం అనేక పుకార్లు వెల్లువెత్తాయి. కాని తరువాత క్రాక్ సినిమాతో తనకు విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని అభ్యర్థనని శృతిహాసన్ తిరస్కరించ లేకపోయారు. అందుకే ఆమె మనసు మార్చుకొని బాలకృష్ణ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది.