టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా అది సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి.  గతంలో బాలకృష్ణతో సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

వాస్తవానికి బోయపాటి శ్రీను పరిస్థితి ఇప్పుడు ఏం అంత బాగా లేదనే చెప్పాలి. ఆయన చేసిన గత చిత్రం వినయవిధేయరామ ఫ్లాప్ కావడంతో దారుణమైన విమర్శలను ఎదుర్కొన్నాడు మెగా అభిమానుల నుంచి. దాంతో ఈ సారి బాలకృష్ణతో అఖండ ద్వారా హిట్ కొట్టి ఎలాగైనా మళ్లీ ఫామ్లోకి రావాలని సినిమా మొదలు పెట్టాడు. బాలకృష్ణ ఎంతో వైవిధ్యభరితంగా ఈ సినిమాలో చూపించారు అని అంటున్నారు. తప్పకుండా బోయపాటి బాలకృష్ణకు ఈ సినిమా హిట్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను తదుపరి సినిమాపై విపరీతమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతుంది.

వరుసగా తెలుగు దర్శకులు తమిళ సినిమాలు చేస్తున్న నేపధ్యంలో బోయపాటి శ్రీను కూడా తమిళ హీరో సూర్య తో సినిమా చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి . వంశీ పైడిపల్లి విజయ్ దళపతి తో శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమాలు చేస్తూ ఉండడంతో బోయపాటి శ్రీను కూడా సూర్య తో సినిమా చేయడం ఖాయం అంటున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బోయపాటి శ్రీను సూర్యతో కాకుండా విశాల్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందట. పందెంకోడి, సెల్యూట్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న విశాల్ పలు డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. మరి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: