
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ కోసం వీరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సింహ, లెజెండ్ సినిమా లతో హిట్ కొట్టిన ఈ కాంబో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా తో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లకి విపరీతమైన స్పందన వచ్చింది.
దాంతో ఈ సినిమా కోసం రాష్ట్రమంతా ఎంతగానో ఎదురు చూస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తదుపరి సినిమాలు వరుసగా ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో సినిమాను అధికారికంగా ప్రకటన చేశాడు బాలయ్య. ఆ సినిమా తరువాత అనిల్ రావిపూడి తో, వెంకీ కుడుముల తో, పూరి జగన్నాథ్ ల తో వరుస సినిమా లు చేస్తాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో పూరి జగన్నాథ్ కాంబో లోని సినిమా ముందు గా తెరకెక్కుతోందని అంటున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా రాగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఈ సారి పూరి జగన్నాథ్ బాలకృష్ణ తో చేసే సినిమా సూపర్ హిట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక మంచి కథను బాలకృష్ణ కోసం పూరి జగన్నాథ్ రాశారట. ఆ సినిమా ఖచ్చితంగా బాలకృష్ణకి హిట్ తెచ్చిపెడుతుంది అని పూరి జగన్నాథ్ నమ్ముతున్నాడు. పైసా వసూల్ సినిమా విజయాన్ని అందించలేకపోయినా బాలకృష్ణ ను ఏ దర్శకుడు చూపని విధంగా చూపించి పూరిజగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా బాలకృష్ణతో వెరైటీ సినిమా చేసి ఈ సారి అన్ని రకాలుగా హిట్టు కొడతానని చెబుతున్నాడు. దీనికి తేడా సింగ్ అనే పేరు పెడతారు అని వార్తలు వస్తున్నాయి.