కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్టరీ వెంకటేష్ ఎన్నో కుటుంబ కథా చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలను ఎన్నో వెంకటేష్ చేయగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత నటించిన కుటుంబ కథ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. యంగ్ హీరో వరుణ్ తేజ్ మరో కథానాయకుడు గా నటించగా వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా మారింది. 2019 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.

వెంకటేశ్ సరసన తమన్నా , వరుణ్ తేజ్ సరసన మెహరీన్ లు హీరోయిన్ లు గా నటించగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ ఇద్దరు హీరోయిన్లు. ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏ గా పని చేస్తూ ఉండే వెంకీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే హారిక తో వివాహం అవుతుంది. మరోపక్క బొరబండ లో ఉండే వరుణ్ యాదవ్ హారిక చెల్లెలు హనీ తో నిశ్చితార్థం అవుతుంది.  పెళ్లి తర్వాత హారిక, ఆమె తల్లి చేసే పనుల వల్ల నిరాశ పెరిగిపోతూ ఉంటుంది వెంకీ లో. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో లో వరుణ్ వెంకీ కి కలుస్తాడు. 

పెళ్లి చేసుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వెంకీ, వరుణ్ పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఈ ఇద్దరి వల్ల వారు విసిగిపోయి పక్కింటి వ్యక్తి సహాయంతో యూరప్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి కూడా వీరు వచ్చి వారికి భార్యల విలువ ఎలా తెలియజేశారు అనేదే ఈ సినిమా కథ. మంచి వినోదంతోపాటు ఎమోషనల్ తో కూడిన ఈ సబ్జెక్టు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. అందుకే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ ఎఫ్3 ను చేస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలు చూడడం లో మన ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ వల్ల ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాం అంటున్నారు. మరి ఎఫ్ 3 సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: