సౌత్ ఇండస్ట్రీ లో ఇప్పుడు నల్ల కోటు సెంటిమెంట్ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" అంటూ నల్ల కోటు ధరించాడు. లాయర్ గా కనిపించి మహిళల పట్ల సమాజంలో చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలపై పోరాటం చేశాడు. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్"కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే అందులో ఉన్న సోల్ ను నాశనం చేశారంటూ విమర్శలు వచ్చినప్పటికీ మెగా ఫ్యాన్స్ తో పాటు లేడీ ఆడియన్స్ కూడా సినిమా సూపర్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవర్ స్టార్ ఎంట్రీ మూవీ కావడంతో మంచి టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను "వకీల్ సాబ్" కొల్లగొట్టాడు. ఓ వైపు కరోనా ఉన్నప్పటికీ పవర్ స్టార్ మాత్రం ఈ కోర్టు డ్రామాలో నల్ల కోటు ధరించి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లాయర్ కోటు సెంటిమెంట్ గా మారిందా ? అనిపిస్తోంది. 

దానికి నిదర్శనం "తిమ్మరుసు", "జై భీమ్" సినిమాలు. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ "తిమ్మరుసు"తో జూలై 30న థియేటర్లలోకి రానున్నాడు. కరోనా సెకండ్ తర్వాత సినిమా హాల్లో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగు చిత్రం ఇదే. ఇందులో సత్య దేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే లాయర్ గా కోర్టులో సత్యదేవ్ అదరగొట్టేయబోతున్నాడని అర్థమవుతుంది. మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల "జై భీమ్" అంటూ మరో కోర్టు డ్రామాను ప్రకటించారు. అందులోనూ సూర్య నల్ల కోటు ధరించి గిరిజనుల హక్కులపై పోరాటం చేయబోతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఈ ఏడాది పవర్ స్టార్ ఎఫెక్ట్ కారణంగా నల్లకోటు ఎఫెక్ట్, సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో నడుస్తుందని ఎవరికైనా అనిపించక మానదు.

మరింత సమాచారం తెలుసుకోండి: