దేశంలో ఎంతోమంది మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తూ గొప్ప గొప్ప పనులు చేస్తూ వారు ఇతరులకు ప్రేరణగా ను ఇస్తారు. వారు చేసే పనుల వల్ల కొంత మంది స్ఫూర్తి చెంది వారి లాగానే గొప్ప గొప్ప పనులు చేయాలని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఓ మహిళ టీచర్ దేశ సమైక్యతను కాంక్షిస్తూ బుల్లెట్ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడు తో అనుబంధం ఉన్న టీచర్ రాజ్యలక్ష్మి ఢిల్లీలో పని చేస్తుండగా ఇప్పుడు ఆమె చేపట్టిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుంది.

ఓ మహిళగా ఆమె చేస్తున్న ఈ కార్యక్రమానికి తోటి మహిళల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. దేశం పట్ల యువతలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు ఈ బుల్లెట్ ప్రయాణం కల్పించాలని ఆమె వెల్లడించింది. ఆదివారం సాయంత్రం మధురై గోరిపాలయం నుంచి ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టి చరిత్ర సృష్టించడానికి నాంది పలికారు. బుల్లెట్ బండి నడుపుకుంటూ మార్గంమధ్యలో ఎదురయ్యే ప్రాంతాలలో ప్రజలకు అవగాహన చైతన్యం కల్పించి దేశ సమైక్యత యొక్క విశిష్టతను తెలియజేసే లక్ష్యంగా ఆమె అలుపెరగకుండా ముందుకు సాగుతున్నారు. 

ఆమె వెన్నంటే క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన 12 మంది, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో 12 మంది యువకులు మోటారు సైకిళ్ళ మీద వెళ్తూ దేశ సమైక్యత యొక్క ఆవశ్యకతను వెల్లడిస్తున్నారు. చెన్నై బెంగళూరు నాగపూర్ ఢిల్లీ మీదుగా 4450 కిలోమీటర్లు 19 రోజులపాటు ఈ ప్రయాణం కొనసాగించనున్నారు. అలాగే ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ఒప్ప గౌందన్ హల్లి లో సమాచార శాఖ నేతృత్వంలో గ్రంధాలయం కూడా నిర్మించారు. ఇక్కడే స్మారక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేయగా వీటిని మంత్రి స్వామినాథన్ ప్రారంభించి ప్రజలకు గొప్ప స్ఫూర్తిని రగిలించారు. మరి ఈ ప్రయాణంలో ఆమె ఎంత పెద్ద చరిత్ర సృష్టిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: