యంగ్ హీరో నాగ శౌర్య సరసన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది రాశిఖన్నా. మొదటి సినిమాతోనే ఆకట్టుకునే అందం, అమాయకత్వపు నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా అగ్ర హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది.అయితే ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా కానీ.. ఈ అమ్మడికి నటనకి ప్రాధాన్యత ఉండే పాత్ర ఇప్పటివరకు దొరకలేదు. ఇప్పటివరకు రాశిఖన్నా నటించినవన్నీ గ్లామర్ పాత్రలే.ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది ఈ భామ.అయినా కూడా ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ప్రస్తుతం రాశిఖన్నా చేతిలో చాలా సినిమాలున్నాయి.కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటోంది.ఇక అటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.ఇక గ్లామర్ రోల్స్ చేసేందుకు రాశి అస్సలు వెనకాడదు. అందుకే ఈమెకి అవకాశాలు తలుపు తడుతున్నాయి.ఇక ప్రస్తుతం తమిళంలో అయితే వరుస సినిమాలతో దూసుకుపోతోంది రాశిఖన్నా.ఇప్పటికే 'అరుణ్ మనై 3', విజయ్ సేతుపతి తుగ్లక్ ధర్భార్' సినిమాలను పూర్తి చేసిన రాశి..తాజాగా కార్తీ సరసన 'సర్ధార్' సినిమాతో పాటు ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక ఈ సినిమాల్లో కొన్ని అయినా సక్సెస్ అయితే రాశిఖన్నా కి ఇక అవకాశాలు క్యూ కడతాయి.అయితే కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఎంచుకుంటే ఇంకా బెటర్.ఇకపోతే తెలుగులోనూ వరుస సినిమాల్లో నటిస్తోంది రాశి.నాగ చైతన్య తో 'థాంక్యూ' ,గోపిచంద్ తో 'పక్కా కమర్షియల్' సినిమాలు చేస్తోంది.అటు హిందీలో షాహిద్ కపూర్ తో ఓ సినిమా,అజయ్ దేవగన్ నటిస్తున్న రుద్ర అనే వెబ్ సీరీస్ లలో నటిస్తోంది.ఇక తెలుగులో కలిసి రాకపోయినా.. మిగతా ఇండ్రస్టీ లలో హిట్లు పడితే అక్కడే సెటిల్ అయిపోదామని అనుకుంటోందట ఈ భామ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: