ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న అన్ని భారీ క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విడుదల తేదీలను ప్రకటించేస్తూ తమ తమ అభిమానులను సంతోష పెడుతున్నాయి.  పుష్ప, రాధే శ్యామ్, ఏకే రీమేక్ , ఎఫ్3, సర్కారు వారి పాట వంటి సినిమాలు మంచి మంచి సీజన్ లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి విడుదల తేదీలను ప్రకటించాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబందించిన విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు.

కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడం లో తనదైన మార్క్ చూపిస్తున్న దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.  కానీ అంతకంతకు ఈ సినిమా విడుదల వాయిదా పడుతుండడంతో వారిలో నిరాశ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంకో వైపు అన్ని సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తూ ఉండడంతో ఆచార్య పై ఒత్తిడి ఎక్కువవుతోంది. తొందరగా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని చిత్రబదం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా రాకపోయి ఉంటే ఈ సినిమా మే లోనే విడుదల అయి ఉండేది కానీ కరోనా వల్ల ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవక తప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని పక్కన పెట్టి మిగతా సినిమాలు షూటింగ్ చేస్తుండడంతో ఆయన ఆచార్య ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అనుమానం కూడా కొంతమందిలో రేగుతుంది. రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో త్వరగా విడుదల తేదీని ప్రకటించింది క్రేజ్ తగ్గిపోకుండా చేస్తే మంచిదని ప్రేక్షకులు చిత్ర బృందానికి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి అందరి సినిమాలు తొందరపడి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆచార్య కూడా తమ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుందా అనేది చూడాలి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: