మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడో రచయితగా కూడా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయనను కొన్ని సినిమాలకు రచయితగా చేయించాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ దర్శకుడిగా రచయితగా ఉన్న త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.

మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పట్టించుకోకుండా అందరూ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేలా చేసేవాడు. పవన్ కళ్యాణ్ తో ఎంతో స్నేహంగా మెలిగే త్రివిక్రమ్ హీరోయిన్లను రిపీట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఆయన గట్టిగా ముగ్గురు నలుగురు హీరోయిన్ కంటే ఎక్కువగా పని చేయలేదు అంటే హీరోయిన్ లను ఎంతగా రిపీట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాలో కామెడీ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన  మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా గత రెండు సినిమాలు కూడా ఆయన పూజ హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటూ ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

అరవింద సమేత వీర రాఘవ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ కాగా ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అలా వైకుంఠపురం లో సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా పూజ హెగ్డే నే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ మరొకసారి తన సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. వాస్తవానికి పూజాహెగ్డే ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా త్రివిక్రమ్ కోసం తన డేట్స్ ను ఎంతో అడ్జస్ట్ చేసి మరీ ఈ సినిమాను ఒప్పుకుందట. చూడబోతే త్రివిక్రమ్ పై ఆమెకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. వేరే ఏ హీరోయిన్ అయినా డేట్స్ లేవని చెప్పి పక్కకు తప్పుకునే ది కానీ త్రివిక్రమ్ సినిమా అనేసరికి పూజా నో చెప్పలేక చెప్పలేక డేట్స్ అడ్జస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: