నిన్న
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు ఎంతగానో
ఖుషీ అయ్యారు. రెగ్యులర్ గా జరుపుకునే
చిరంజీవి పుట్టినరోజులా కాకుండా ఈసారి బంపర్ ప్రైజు లతో ఈ పుట్టిన రోజును జరుపుకున్నారు. సినిమాల్లోకి వచ్చి
మెగాస్టార్ గా ఎదిగిన
చిరంజీవి కి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ దూసుకుపోతున్న
చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉంటూ ప్రేక్షకులను గతంలో కంటే ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆయన హీరోగా మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ పైన ఉన్నాయి అంటే
చిరంజీవి ఏ రేంజ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలి అని అనుకున్నాడో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న ఆచార్య
సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు అని అందరూ అనుకున్నారు కానీ దర్శకుడు
కొరటాల శివ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి విడుదల తేదీని ప్రకటించకపోవడం గమనార్హం.
చిరంజీవి సినిమాలు అప్డేట్ లో ఒకటిగా బయటికి వచ్చి మెగా అభిమానులను సంతృప్తి పరిస్తే ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన ఆచార్య
సినిమా విడుదల తేదీని
కొరటాల శివ అనౌన్స్ చేయకపోవడంతో అందరూ ఒక్కసారిగా నిరాశ పడ్డారు.
కొరటాల శివ మౌనానికి కారణం ఏంటి అని అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు.
నిర్మాత రామ్ చరణ్ కూడా ఈ
సినిమా పై ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం మెగా అభిమానులను కలవరపరుస్తోంది. మరి ఇ అని పెద్ద సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఈ
సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే అనుమానాన్ని అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఎప్పుడు ఈ
సినిమా కి సంబందించిన విడుదల తేదీ పై క్లారిటీ వస్తుందో చూడాలి.