ఎందుకంటే అప్పటివరకు తన తండ్రి అయిన నటరత్న నందమూరి తారక రామారావు కాంబినేషన్ లోనే భారీ విజయాలు బాలయ్య సాధించాడు.సోలో హీరోగా ఈ సినిమాతోనే తొలి భారీ విజయం అందుకున్నారట బాలయ్య.దిగ్గజ దర్శకుడు అయిన భారతీరాజా తమిళ చిత్రం `మణ్ వాసనై`రూపొందించాడు.ఇందులో పాండియన్, రేవతి హీరో హీరోయిన్ లు గా నటించారు. సినిమా ఆధారంగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలయ్యకి జంటగా సుహాసిని నటించి మెప్పించారు.
మంగమ్మ పాత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి తనదైన అభినయంతో అలరించారని సమాచారం. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో గొల్లపూడి మారుతీ రావు మరియు గోకిన రామారావు అలాగే అనిత, వై. విజయ నటించి మెప్పించారు. వందకు పైగా చిత్రాలు తీసిన దర్శకుడు అయిన కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని `భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్` పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించారని సమాచారం. స్వరబ్రహ్మగా పేరు పొందిన కేవీ మహదేవన్ బాణీలు అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ మంచి విజయం సాధించినట్లు సమాచారం. మరీముఖ్యంగా ఈ సినిమాలో .. ``దంచవే మేనత్త కూతురా` పాట అప్పట్లో యువతతో పాటు అన్ని వర్గాల వారిని విశేషంగా అలరించి మంచి విజయం సాధించిందని సమాచారం.
అలాగే `చందురుడు నిన్ను చూసి`` మరియు ``గుమ్మ చూపు``, ``వంగతోట కాడ``, ``శ్రీ సూర్యనారాయణ`` వంటి పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయని సమాచారం.అలాగే ఈ సినిమా హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శితమైందని సమాచారం.`మంగమ్మ గారి మనవడు`సినిమా తెలుగునాట పలు కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుందని సమాచారం. అలాగే కర్ణాటకలోనూ 100 రోజులు ఆడిందని తెలుస్తుంది. భానుమతి పుట్టినరోజు కానుకగా 1984 సెప్టెంబర్ 7న విడుదలై `మంగమ్మ గారి మనవడు సినిమా సంచలన విజయం సాధించిందట.
ఇంతటి భారీ విజయం సాధించిన మంగమ్మ గారి మనవడు సినిమా నేటితో 37సంవత్సరాలు పూర్తి చేసుకుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి