హాట్ బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ లవర్స్ డే సినిమా నుండి బయటకు వదిలిన ఒక చిన్న ప్రోమో లో కన్ను కొట్టి యావత్ భారత దేశ యువత మనసు కొల్లగొట్టింది. ఇలా భారతదేశం వ్యాప్తంగా ఒకే ఒక్క చిన్న ప్రోమో తో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఆ తర్వాత తెలుగు లోనూ నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ , టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించినప్పటికి ఈ సినిమాలు ఈ ముద్దు గుమ్మకు విజయాలను మాత్రం తెచ్చి పెట్టలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా ప్రకాష్ వారియర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రియా ప్రకాష్ వారియర్ వర్షం గురించి తన అనుభూతులను తెలియజేసింది. 
వర్షం పడుతున్న సమయంలో బయట తిరగడం ఇష్టం అని, తనకు వర్షంలో తడవడం చాలా ఇష్టం అని తెలియజేసింది.

 వర్షా కాలం వచ్చిందంటే కొత్త గొడుగు , రెయిన్ కోర్టు కొనుగోలు చేసేదాన్ని, ట్రాన్సపరెంట్ గొడుకు కొనుగోలు చేయడం వర్షం వస్తున్న సమయంలో ఆ అనుభూతిని ఎంజాయ్ చేసేదాన్ని అంటూ ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. రెయిన్ లో స్కూ ల్ బస్ కోసం వెయిట్ చేయడం చాలా సరదాగా అనిపించేదని, వర్షం వస్తున్న సమయంలో మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని. అయితే వర్షం వస్తున్న సమయంలో పని చేయడం అంటే మాత్రం చాలా బద్దకం అని తెలియజేసింది. నేను ఒక సినీ ప్రేమికురాలిని కనుక నన్ను నేను రెయిన్ సాంగ్ లో చూసుకోవాలని కోరుకుంటున్నాను అని  ప్రియా ప్రకాష్ వారియర్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: