ఇటీవల కాలంలో దసరాకు రాబోయే సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అక్టోబర్ 8వ తేదీన వైష్ణవ్ తేజ్ తన రెండవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా అక్టోబర్ 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతుండటం గమనార్హం. శర్వానంద్ హీరోగా నటించిన మహా సముద్రం సినిమా మరియు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అలాగే నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమా అక్టోబర్ 15వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో దసరా స్లాట్ మొత్త బుక్ కావడంతో కొన్ని క్రేజీ చిత్రాలు వేరొక తేదీని ఎంచుకునే పనిలో పడ్డాయి. ఆ విధంగా నాగచైతన్య హీరోగా చేస్తున్న లక్ష్య చిత్రం ఇప్పుడు విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఉందని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. దసరా కి ఛాన్స్ లేకపోవడంతో కొన్ని కొన్ని చిత్రాలు దీపావళి స్లాట్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టాయి. రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తె సినిమా కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది.

 ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని చిత్రలు దీపావళి కానుకగా నవంబర్ లో సెట్ అవుతాయి చూడాలి.  ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పకవిమానం సినిమాను కూడా అదే రోజున విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అంతేకాకుండా ఇంకొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఆ రోజులు రావాలని చూస్తున్నాయట. కరోనా కాలంతో సినిమాలన్నీ ఒక్కసారిగా విడుదల ఆగిపోయాయి. ఇప్పుడు కరోనా తగ్గిపోయి థియేటర్లు అన్ని ఓపెన్ కావడంతో ఒక్కొక్కటిగా సినిమాలు అన్ని విడుదల అవుతూ మునుపటి వైభవం తెచ్చుకునే విధంగా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతగా ఉపయోగపడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: