మా ఎన్నికలలో ఎన్నో అవకతవకలు జరిగాయి. మా ఎన్నికలు సవ్యంగా జరగలేదు. క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అన్యాయం జరిగింది. రాత్రికి రాత్రి అన్ని మార్చేశారు అనేది ప్రకాష్ రాజ్ వర్గం వారు చెబుతున్న మాట. ఎన్నికలు ముగిసిన కూడా మాటల యుద్ధం మాత్రమే ఇంకా ముగియలేదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. మొదటి నుంచి వీరు ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.  మంచు విష్ణు విజయం తర్వాత రాజీనామాల పర్వం మనం చూస్తూనే ఉన్నాం. మరొకవైపు మంచు విష్ణు ఈ రాజీనామాలను ఆమోదించనని చెబుతున్నారు.

 అయినా కూడా పరిస్థితులలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేసిన ఆరోపణలు చేసిన తర్వాత ఈ వివాదం ఇంకో రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో ఇలాంటి అడ్డు ఉండకుండా విష్ణు పని చేయాలని ప్రకాష్ రాజ్ చెబుతూనే ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. ఇంకోవైపు మంచు విష్ణు బహిరంగంగా ప్రకాష్ రాజ్ ను వెనకేసుకొస్తున్న వెనకాల తొక్కేసేలా చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలు సవ్యం గా జరగలేదు అనడానికి మరొక ఉదాహరణ ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపు పెట్టే ను ఇంటికి తీసుకు వెళ్లడం చర్చనీయాంశం గా మారింది. దాన్ని బెనర్జీ అడ్డుకోవాలని చూసిన మోహన్ బాబు ఇష్టం వచ్చినట్టుగా ఆయనపై నోరు చేసుకున్నారు. 

ఆ విధంగా ఈసారి మా ఎలక్షన్స్ సవ్యంగా న్యాయబద్ధంగా జరగలేదనేది మాత్రం వాస్తవం అని చెప్పుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి రెవల్యూషన్ వస్తుందో చూడాలి. భవిష్యత్తులో దీనికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయేమో అనిపిస్తుంది.  950 మంది ఉండే ఓ చిన్న అసోసియేషన్ ఎన్నికలు ఇలా జరగడం రాష్ట్రంలోనే పెద్ద సంచలనం విషయంగా మారింది. మరి ఈ వివాదాలు ఎప్పుడు సద్దుమణిగి తిరిగి మళ్ళీ ఎప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తారో వీరు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: