వరస సూపర్ హిట్స్ తరువాత విజయ్ దేవరకొండను వరస ఫ్లాప్ లు కలవర పెడుతున్నాయి. ‘డియర్ కామ్రేట్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాల వరస పరాజయాలతో విజయ్ దేవరకొండ ఎలర్ట్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నో ఆలోచనలు చేసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ పై విజయ్ చాల ఆశలు పెట్టుకున్నాడు.


కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఈమూవీ తిరిగి పరిస్థితులు చక్కబడుతున్నప్పటికీ ఎప్పుడు విడుదల అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈమూవీ కథ అంతా ఒక బాక్సర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈమూవీలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైక్ టైసన్ తో బాక్సింగ్ సీన్స్ లో నటించినప్పుడు విజయ్ తాను పడ్డ టెన్షన్ వివరిస్తూ ఒక ప్రముఖ బాలీవుడ్ పత్రికకు ఈమధ్య ఇంటర్వ్యూ ఇచ్చాడు.


ఈమూవీలో నటించే ముందు బాక్సింగ్ సీన్స్ లో సహజత్వం కోసం తాను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నప్పటికీ షూటింగ్ స్పాట్ లో పూరీ మైక్ టైసన్ తో షూట్ చేస్తున్నప్పుడు తాను చాల టెన్షన్ పడ్డ విషయాన్ని బయటపెట్టాడు. మైక్ టైసన్ వేగంగా తన పై పంచ్ లు విసురుతున్నప్పుడు అతడి చేతి దెబ్బకు తనకు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అన్న భయంతో ఒకటికి రెండు మూడు సార్లు ఆ సీన్స్ ను రీ షూట్ చేయవలసి వచ్చిందని చెపుతూ జోక్ చేసాడు.


ఇదే సందర్భంలో ఈమూవీ గురించి మాట్లాడుతూ ఈమూవీ కోసం తాను చాల కష్టపడవలసి వచ్చిందని ప్రస్తుతం హీరోల మధ్య పోటీ చాల ఎక్కువగా ఉండటంతో బాగా కష్టపడినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలుగుతారు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను నటించే ప్రతిసినిమా తనకు కొత్త సినిమాగా భావిస్తూ తన అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ నచ్చే విధంగా సినిమా కథలను ఎంచుకోవడానికి తన ప్రయత్నం కొనసాగిస్తున్నాను అంటూ ‘లైగర్’ పై అంచనాలు పెంచుతున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: