ప్రముఖ కమెడియన్ కం హీరో సునీల్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో పంచ్ లు వేస్తూ నవ్వించాడు సునీల్. నిజానికి సునీల్ ది ఆంధ్ర పేదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం. సినిమాలు మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన సునీల్ ముందు టాప్ కమెడియన్గా ఎదిగి.. ఆ తర్వాత హీరో గా మారాడు. అయితే హీరోగా మారాక సునీల్ ఫస్ట్ లో వరుసగా హిట్లు కొట్టాడు. దీంతో మనోడు కి హీరోగా తిరుగులేదు..కెరీర్ లో సెటిల్ అయ్యిపోయాడు అని అనుకుంటున్న తరుణంలో వరుస ఫ్లాప్ లు పడ్దాయి.
దీంతో అవకాశాలు తగ్గాయి. కాదు కాదు అసలు అవకాశాలే రాలేదు. ఏదో వచ్చిన అరాకోరా ఆఫర్లు కమెడియన్ గానే వచ్చాయి. ఇక సునీల్ సినీ జీవితానికి ఎండ్ కార్డ్ పడేటట్లు ఉంది అని అనుకుంటున్న టైంలో ఆయన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.అలా అల వైకుంఠపురం సినిమాలో అవకాశం అందుకున్న సునీల్..ఆ తరువాత మళ్లీ కెరీర్ పుంజుకున్నట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం సునీల్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ఆయన ఫస్ట్ లుక్ అతి భయంకరంగా ఉండడం..మునుపెన్నడూ లేని విధంగా బట్టతలతో కోపం గా ఎక్స్ప్రెషన్స్తో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత సునీల్ కెరీర్ మళ్ళి స్పీడ్ అప్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమాకి పారితోషకంగా ఆయన 80 లక్షల రూపాయిలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక జబర్ధస్త్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో సునీల్ కు భార్యగా నటిస్తోంది.