
ఈ రోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో.. కొమురం భీముడో పాట పాత పాటకు కాపీ అని కొందరు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఇది అచ్చం గద్దర్ పాడిన మదనా సుందరీ.. మదనా సుందరీ పాట లాగే ఉందని ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నారు. కొమురం భీముడో అని వచ్చేటప్పుడు అదే సాంగ్ గుర్తొస్తుందంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లోని ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా.. కీరవాణి సంగీతం అందించాడు. కీరవాణి కుమారుడు కాలభైరవ పాడాడు.
ఇక పాన్ ఇండియన్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో కేవలం ప్రీమియర్ల బుకింగ్స్ సేల్స్ 1మిలియన్ డాలర్ల మార్కు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. అయితే జనవరి 6, 2022న అమెరికాలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్, పాటలతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర సినిమా ప్రమోషన్ లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ఆర్ఆర్ఆర్ పోస్టర్ ఆవిష్కరించారు. మరోపక్క ప్రొకబడ్డీ లీగ్ లోనూ సినిమా గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఏ మాత్రం గ్యాప్ లేకుండా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.తాజాగా వీరితో రానా దగ్గుబాటి కలిశాడు. వీరు నలుగురు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.