హౌజ్ లో సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అవడంపై దీప్తి సునైనా చాలా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకే బిగ్ బాస్ నుండి వచ్చాక షణ్ముఖ్ ని కలవలేదు. కనీసం మాట్లాడలేదు కూడా. ఇక ఇదే విషయంపై షణ్ముఖ్ కూడా స్పందించాడు. దీప్తి సునైనా తనని బ్లాక్ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అయితే దీప్తితో బ్రేకప్ జరగని పని అని.. తన చేతికి టాటూ చూపించి ఇది ఉన్నంత వరకు దీప్తి తనతో ఉంటుందని. గొడవలు సర్ధుమనిగాక మళ్లీ ఇద్దరం కలుస్తామని అన్నాడు షణ్ముఖ్.
హౌజ్ లో తను ఆట మీద కన్నా సిరి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అందుకే టైటిల్ కు దూరమయ్యాడు. ఈ విషయంలో షణ్ముఖ్ పై దీప్తి చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది. అయినా ఆల్రెడీ బయట కమిటెడ్ అయిన షణ్ముఖ్ హౌజ్ లో ఉన్న 100 రోజుల్లో మరో వ్యక్తితో ఎలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాడని అందరు అనుకుంటున్నారు. ఈ విషయంపై దీప్తి చాలానే హర్ట్ అయినట్టు అనిపిస్తుంది. అయితే షణ్ముఖ్ తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి దీప్తి అతన్ని క్షమించేస్తే బాగుంటుంది. అదే అతని ఫ్యాన్స్ కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి