కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన హీరోగా చేసిన ఆకాశమే నీ హద్దురా, అలాగే జై భీమ్ సినిమాలు ఓ టీ టీ లో విడుదలై సూపర్ హిట్ లు అందుకున్నారు. దాంతో ఇప్పుడు చేయబోయే చిత్రం తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఆయన గత రెండు చిత్రాలు ఓ టీ టీ లో విడుదలైన పేరే కానీ వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాలను థియేటర్లలో విడుదల అయితే చాలా బాగుండేది అని ఎంతో బాధపడ్డారు కూడా.

కానీ అప్పటికి సమయం అలా ఉండడంతో సూర్య ఆ సినిమాలను ఓ టీ టీ లో విడుదల చేసి హిట్ కొట్టి అభిమానులను ఎంతగానో ఖుషీ చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై చేస్తున్న మాస్ సినిమా ను కూడా భారీ స్థాయిలో చేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈసారి థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేసి చిత్రంపై అంచనాలు భారీగా పెంచారు.

ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం సమకూర్చగా సూర్య తన గత సినిమాల కంటే ఈ చిత్రంలో ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. ఎప్పుడూ లేని విధంగా ఆయన మేకోవర్ కూడా సరికొత్తగా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా స్టోరీ చాలా బాగుంటుందని అది తప్పకుండా ఆయనకు మంచి హిట్ ను తీసుకు వస్తుందని చిత్ర బృందం వెల్లడిస్తుంది. మరి వరుస విజయాలతో పట్టిందల్లా బంగారమే అవుతున్న సూర్య కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. తెలుగులో కూడా సూర్యకు మంచి అభిమానగణం ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ భారీ స్థాయిలో విడుదల అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: