నాని కెరియర్ లో శ్యామ్ సింగ రాయ్ డెఫినెట్ గా డిఫరెంట్ మూవీ అని చీప్పొచ్చు. ట్యాక్సీవాలా లాంటి ఒక సినిమా అనుభవం ఉన్న హీరోతో నాని చేసిన ప్రయోగం ఆడియెన్స్ ని మెప్పించిందని చెప్పొచ్చు. శ్యామ్ సింగ రాయ్ మూవీని నాని చాలా ప్రెస్టిజియస్ గా తీసుకుని సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలో నాని వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు పాత్రల్లో నటించి సూపర్ అనిపించాడు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో మాత్రం ఇన్నాళ్లు నానిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించేలా చేశాడు.

శ్యామ్ సింగ రాయ్ 2021 చివర్లో అదే డిసెంబర్ 24న రిలీజైంది. సినిమా పై చిత్రయూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్ లో సక్సెస్ అయినా సినిమా టాక్ విని చూడాలనుకున్న వారికి ఈ కరోనా అడ్డంకిగా మారింది. మాములు టైం అయితే శ్యామ్ సింగ రాయ్ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ కి ఓ రేంజ్ లో వసూళ్లు ఉండాల్సింది కానీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లు మాత్రం యావరేజ్ గానే అనిపించాయి.

ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈ నెల 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆడియెన్స్ అంతా శ్యామ్ సింగ రాయ్ సినిమాని డిజిటల్ రిలీజ్ చూసేందుకు రెడీగా ఉన్నారు. సినిమా సూపర్ అని టాక్ వచ్చినా థియేటర్ కి వెళ్లలేని కొందరు ఆడియెన్స్ ఖచ్చితంగా శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఓటీటీలో చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. అందుకే ఆ ఆర్ వెయిటింగ్ ఫర్ శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ అని తెలుస్తుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సహజ నటి సాయి పల్లవి మరో అద్భుతమైన పాత్రతో మెప్పించింది. కృతి శెట్టి కూడా మోడ్రెన్ గాళ్ పాత్రలో మెప్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: