అందాల ముద్దుగుమ్మ తాప్సీ, మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే టాక్ ను సంపాదించుకోవడం తో పాటు తాప్సీ నటనకు,  అంతకుమించిన అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే తాప్సీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది,  బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి సినిమా అవకాశాలు రావడం, ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా అక్కడ మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో తాప్సీ  కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాప్సి  కేవలం కమర్షియల్ సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది, బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా తాప్సి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా, వెళ్ళాను అని నిర్మొహమాటంగా తాప్సి చెప్పేసింది, అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను అని తాప్సి సమాధానం చెప్పింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుత బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. నేను  మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు... అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న... అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు అని తాప్సి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: