పెళ్లి తర్వాత అక్కినేని
సమంత పెద్ద హీరోల సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కొన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చింది. ఫేడ్ ఔట్ అయిపోతున్న ఓ
హీరోయిన్ సినిమా పరిశ్రమలో ఎన్నిరోజులు కొనసాగలేదు ఆ విధంగానే ఆమె ప్రేమించి
పెళ్లి చేసుకునే వ్యక్తికి విడాకులు ఇచ్చి సింగల్ గా మారింది సమంత. ఈ నేపథ్యంలో ఆమె సినిమాల్లో నిలదొక్కుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆమె ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది. ఐటమ్ సాంగ్ లో ఆమె చేసిన డాన్స్ కి అందరూ
ఫిదా అయిపోయారు.
ఈ విధంగా భారీ స్థాయిలో రీఎంట్రీ ఇచ్చిన
సమంత కు మరికొన్ని
సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి ఇప్పటికే రెండు లేడీ ఓరియంటెడ్
సినిమా పూర్తి చేసింది
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ
సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇది ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. దీని ద్వారా
సమంత ఇమేజ్ కొంత కూడా మారలేదని ఇప్పటికే నిరూపితం అయింది.
ఏదేమైనా పడిలేచిన కెరటంలా నటించడానికి ముందుకు దూసుకుపోతున్న సమంతా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని ఆలోచించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యశోదా అనే మరో లేడీ ఓరియంటెడ్
సినిమా చేస్తున్న నేపథ్యంలో
బాలీవుడ్ లో మరియు హాలీవుడ్లో సైతం ఆమె సినిమాలు అందుకోవడం విశేషం. అంతేకాదు తెలుగు లో పెద్ద
హీరో సినిమాలో కూడా ఆమె
హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది ఈ విధంగా
సమంత వరుస సినిమాల్లో బిజీ అవుతూ మునుపటి స్థాయిలో క్రేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఆమె అభిమానులను తీవ్ర స్థాయిలో సంతోషపరుస్తుంది.