టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంకా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా విడుదల తేదీ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినీ అభిమానుల్లో ఫుల్ జోష్ అనేది పెరిగింది.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.భీమ్లా నాయక్ మేనియా ఇప్పుడు అసలు మాములుగా లేదని చెప్పాలి. ఫ్యాన్స్ ఇప్పటినుంచే హడావుడి స్టార్ట్ చేశారు. ఇక భీమ్లా నాయకుడి పవర్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా తాకింది. యూఎస్ (USA)లో ఒక రోజు ముందుగానే అనగా ఈరోజే భీమ్లా నాయక్ సినిమా సందడి చేయనుంది. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో టికెట్లు అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముందుస్తు బుకింగ్స్ అయితే 4లక్షల యూఎస్ డాలర్లు దాటిందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమా అమెరికా దేశం వ్యాప్తంగా 400కు పైగా థియేటర్లలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం 3000కు పైగా స్క్రీన్ లో ప్రదర్శించబడుతోంది.


ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ భీమ్లా నాయక్ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఇక ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 21 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చినా కాని ఫ్యాన్స్ నుంచి అయితే అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. ఇక బుధవారం నాడు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్  ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా సినిమా సెకండ్ ట్రైలర్ ని విడుదల చేయగా దానికి ఇప్పుడు అద్భుతమైన స్పందన అనేది వస్తుంది.ఖచ్చితంగా ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 100 కోట్ల షేర్ తెచ్చే సినిమా అవుతుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: