ఇటీవల కాలంలో
హీరోయిన్ శృతిహాసన్ చేస్తున్న వరుస సినిమాలు చూస్తుంటే ఆమె అభిమానులను ఇది ఎంతగానో సంతోష పెడుతుంది అని చెప్పవచ్చు. అంతకు ముందు సినిమాలు చేసే విషయంలో ఎంతో ఆలస్యం చేసే
శృతిహాసన్ ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకుంటుంది. స్టార్
హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఉన్న కూడా ఈమె సినిమాలను ఒప్పుకునే విషయంలో జాప్యం చేసేది. కారణం అయితే తెలియదు కానీ ఈమె ఒక సినిమాను ఒప్పుకునేందుకు చాలా ఆలస్యం చేసేది.
ఆ విధంగా మంచి సినిమాలు చేస్తూ
శృతిహాసన్ ఒక్కసారిగా సినిమాలు చేయకపోవడం తో ఆమె క్రేజ్
మార్కెట్ పడిపోయింది. ఒకానొక దశలో ఈమె కెరీర్ చివరి దశకు వచ్చింది అన్నట్లుగా ఆమె చేతిలో
సినిమా అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ వరుస సినిమాల్లో చేసే విధంగా ముందుకు పోతుంది. ఈ కొత్త మార్పు ఆమె అభిమానులను ఆశ్చర్యం తో ఆనందాన్ని కూడా కలుగ జేస్తుంది. ఇప్పటికే
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో
హీరోయిన్ గా నటిస్తుంది శృతిహాసన్.
బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మాస్ సినిమాలో కూడా చేస్తుంది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా
చిరంజీవి బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే
సినిమా ఆఫర్ వచ్చిన వెంటనే
హీరోయిన్ గా చేస్తుంది. అలా మూడు భారీ చిత్రాల్లో
హీరోయిన్ గా ఎంపిక కావడం చూస్తుంటే ఆమె పూర్వవైభవం తెచ్చుకునే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలు ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుని ఆమె క్రేజ్ తీసుకు వస్తాయో చూడాలి. తమిళ,మలయాళ,
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సైతం ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. అక్కడ కూడా కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఆమె భవిష్యత్ లో ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.