ప్రస్తుతం ఈయన గని, ఎఫ్ 3' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాలు రెండు కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి బాక్సింగ్ నేపథ్యం లో వస్తుంది. మరోకటి కామెడీ ఎంటర్టైన్మెంట్ కథ తో ఆ చిత్రం రానుంది. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమా ఎంతగా ప్రెక్షకులను అలరించిందొ అందరికి తెలుసు.. ఇప్పుడు వస్తున్న సినిమా కూడా అంతే హిట్ అవుతుందని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..కాగా, వరుణ్ తేజ్ ఇప్పుడు మరో కొత్త కథతో సినిమాను చెయనున్నారు..
పూజా కార్యక్రమాలను పూర్తీ చేసుకొని సినిమా షూటింగ్ మొదలైంది.నాగబాబు క్లాప్ తో , ఆయన భార్య పద్మజ కెమేరా స్విచ్ ఆన్ తో చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రాజశేఖర్ హీరోగా 'గరుడవేగ' తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.. ఆ డైరెక్టర్ ఇప్పుడు అక్కినేని నాగర్జున తో ది ఘోస్ట్ సినిమాను చేస్తున్నారు.యాక్షన్ కథ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.నాగార్జున రా ఆఫీసర్ గా సరికొత్త గెటప్ తో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వరుణ్ తేజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. పూర్తిగా లండన్ లోనే చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈ చిత్రం యాక్షన్,లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. మిక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ మొదలు కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి