టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు లైగర్ సినిమాను పూర్తిచేసుకుని జనగణమన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటం విశేషం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పూరి జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోతో సినిమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ రెండు సినిమాలు ఆయనకు ఏ స్థాయిలో విజయాన్ని తెచ్చి పడతాయో చూడాలి.  దర్శకులలో ఎక్కువ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న డైరెక్టర్ గా పూరిజగన్నాథ్ ఉన్నాడు.

దానికి కారణం ఆయన చేసిన సినిమాలు ప్రతి సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేసి వచ్చే సినిమాలు కావడంతో ఆయన సినిమాలు వారికి విపరీతంగా నచేవి. అందుకే ఆయనకు ఎక్కువగా అభిమానులు ఉంటారు. ఒక పెద్ద హీరో కి ఉండే అభిమానులు ఆయనకు ఉన్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ విధంగా పూరి జగన్నాథ్ సినిమా సినిమాకి తన స్థాయి తో పాటు అభిమానులను కూడా పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన టాలీవుడ్ లో ఏ హీరో అయినా సినిమా చేయగల సత్తా కలిగి ఉన్న దర్శకుడిగా ఎదిగాడు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తో మాత్రం ఆయన ఇప్పటివరకు సినిమా చేయలేక పోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరచే విషయమే. గతంలో చిరంజీవి 150వ సినిమాను చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆటోజానీ అనే ఓ కథను కూడా సిద్ధం చేశాడు కానీ ఎందుకో అది వర్కవుట్ అవ్వలేదు. తాజాగా ఆయన మరొక కథను చిరంజీవి కోసం రాశారని అది తప్పకుండా మెగాస్టార్ ఒప్పుకోవడం ఖాయమని పూరీ కాంపౌండ్ చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత చిరంజీవితో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయ్యాడట. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబో ఓకే అయితే చూడాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: