ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న హీరో ఎవరంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. క్రేజ్, కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్న మహేష్ బాబు పెద్ద సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా లేకపోయినా కూడా మహేష్ కి వున్న కల్ట్ ఫ్యాన్ బేస్ వల్ల ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` సినిమాలోని మాస్ సాంగ్‌ను శనివారం నాడు హైదరాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో విడుదల చేశారు.యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే పాటలు రాసి మెప్పిస్తున్న యువ పాటల రచయిత అనంత శ్రీరామ్ రాసిన మమ మహేష్‌..` పాటను తాను పూర్తిగా రిలీజ్‌కు ముందే చూసేశానని డైరెక్టర్ సుకుమార్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన సూపర్ స్టార్ గురించి పలు విషయాలను కూడా తెలియజేశారు.


సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో `1` నేనొక్కడినే సినిమా చేశాను. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు.ఆయన సెట్లో దర్శకుడిని ఒక కింగ్‌లా చూస్తారు. ఏ దర్శకుడు అయినా కానీ చిన్న పిల్లాడిలా.. మళ్ళీ మళ్ళీ ఇంకో టేక్ అంటే చాలా ముద్దుగా వుంటుంది.అప్పుడు ప్రతిరోజూ కూడా ఓ గొప్ప అనుభూతి.నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.అని అన్నాడు.ఇక `సర్కారు వారి పాట` సినిమాలో చాలా జోవియల్‌గా చేశారు. నేను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. నాకు కళావతి ఇంకా మమ మహేష్ పాటలు ఫేవరేట్ ట్యూన్స్‌.థమన్ ఎంతో అద్భుతంగా బాణీలు ఇచ్చాడు. మైత్రీ మూవీస్ బేనర్‌కు మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. దర్శకుడు పరశురామ్‌.. గీత గోవిందం సినిమా చూస్తే.. చాలా సెన్సిటివ్గా చేశాడు. కానీ ఇప్పుడు మాస్ సినిమా చేశాడు. అతను మంచి డైలాగ్ రైటర్ కూడా అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: