ఇక ఇదే ట్రెండ్ లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రం 83. 1983 కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొదటిసారి టీమిండియా వరల్డ్ కప్ సాధించింది. అయితే పసికూన లాంటి టీమిండియా అటు వరల్డ్ కప్ లో అడుగుపెట్టి దిగ్గజ జట్లను సైతం ఓడిస్తూ ఎలాంటి ఫెసిలిటీలు లేని సమయంలో ఆటగాళ్లు అద్భుతంగా రాణించిన తీరు కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు. కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొనే నటించింది.
కాగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్గా మాత్రం హిట్ ఇవ్వలేక పోయింది అంటూ ఎన్నో విమర్శలు కూడా చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు 83 సినిమా హీరో రణవీర్ సింగ్. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది అని కొందరు విమర్శిస్తున్నారు. కరోనా మూడవ దశ మధ్యలో రిలీజ్ అయ్యి దాదాపు 200 కోట్లు సంపాదించింది ఈ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్. 83 సినిమా ఫ్లాప్ కాదు అంటూ తెలిపాడు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయానికి పరిస్థితులు బాగా లేకపోవడంతో మా దురదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు..