కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయిన తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. నెల్సన్  దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవడంతో బీస్ట్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బీస్ట్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో  10 కోట్ల మేరా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బీస్ట్ మూవీ 10.50 కోట్ల టార్గెట్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన బీస్ట్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మిక్సీడ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా కాస్త తక్కువ మొత్తంలోనే వచ్చాయి. బీస్ట్ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసిందో చూద్దాం.

నైజాం : 2.80 కోట్లు
సీడెడ్ : 1.15 కోట్లు
యూ ఎ : 83 లక్షలు
ఈస్ట్ : 52 లక్షలు
వెస్ట్ : 41 లక్షలు
గుంటూర్ : 60 లక్షలు
కృష్ణ : 62 లక్షలు
నెల్లూర్ : 40 లక్షలు
బీస్ట్ టోటల్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముగిసే సరికి 7.33 కోట్ల షేర్ , 13.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
10 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగిన బీస్ట్ మూవీ ఫైనల్ గా 7.33 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి , చివరగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.17 కోట్ల నష్టాలను మిగిల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: