టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరు అయిన పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు.  నిఖిల్ హీరోగా తెరకెక్కిన యువత సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి సినిమాలకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లలో సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పరశురామ్ కు మంచి క్రేజ్ లభించింది.  

ఇలా దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించే  అవకాశం పరశురామ్ కి దక్కింది.  అందులో భాగంగా పరశురామ్,  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు. మే 12 వ తేదీ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్  టాక్ ను తెచ్చుకున్నప్పటికీ అదిరిపోయే కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేస్తోంది.

ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న పరుశురామ్ తన తదుపరి సినిమా నాగ చైతన్య తో తెరకెక్కించ బోతున్నట్లు ఇది వరకే ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే పరశురామ్,  నాగ చైతన్య తో తెరకెక్కించబోయే సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.  ఇప్పుడు ఇదే టైటిల్ ను పరుశురామ్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: